రేపల్లెలో ముమ్మరంగా స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు

రేపల్లెలో ముమ్మరంగా స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు
రేపల్లె సెప్టెంబర్ 21 యువతరం న్యూస్:
రేపల్లెలో స్వర్ణాంధ్ర కార్యక్రమాలు శనివారం ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మొక్కలు నాటారు. పట్టణ ప్రధాన రహదారిలో ప్రదర్శన నిర్వహించారు. పట్టణాన్ని స్వచ్ఛ రేపల్లెగా రూపొందించి స్వర్ణాంధ్రలో భాగం అవుతామని నాయకులు, అధికారులు, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు, రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి, తహసిల్దార్ మోర్ల శ్రీనివాసరావు, రేపల్లె టౌన్ సి ఐ మల్లిఖార్జునరావు, మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ రామచంద్ర రావు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.