రేపల్లె, నిజాంపట్నంలో స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్
నిజాంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎక్సరే విభాగాన్ని ప్రారంభిస్తున్న అనగాని శివప్రసాద్

రేపల్లె, నిజాంపట్నంలో స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్
నిజాంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎక్సరే విభాగాన్ని ప్రారంభిస్తున్న అనగాని శివప్రసాద్
రేపల్లె సెప్టెంబర్ 21 యువతరం న్యూస్:
రేపల్లె పట్టణం నిజాంపట్నం మండల కేంద్రంలో శనివారం స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ (ఆరోగ్యవంతమైన మహిళలు శక్తివంతమైన కుటుంబం)కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రేపల్లెలో మహిళలకు బాలామృతం అందచేశారు. నిజాంపట్నం ప్రభుత్వ వైద్యాశాలలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్ పాల్గొని వైద్యాశాల లో ఏర్పాటు చేసిన నూతన ఎక్స్ రే విభాగం, మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో రాష్ట్ర అగ్ని కుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ బొమ్మిడి రామకృష్ణ గారు, నిజాంపట్నం మండల జడ్పీటీసీ నర్రా సుబ్బయ్య, నిజాంపట్నం టౌన్ టీడీపీ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాబు, నిజాంపట్నం మండల జనసేన అధ్యక్షులు మైల నరేష్, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.