ANDHRA PRADESHDEVELOPOFFICIAL

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన భోజనం అందించడంతో పాటు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పాలి

కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన భోజనం అందించడంతో పాటు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పాలి

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

క్రిష్ణగిరి సెప్టెంబర్ 21 యువతరం న్యూస్:

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన భోజనం అందించడంతో పాటు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పాలని కలెక్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ను ఆదేశించారు.
శనివారం కృష్ణగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, సచివాలయంను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలను తనిఖీ చేస్తూ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? శనివారం ఎంత మంది వచ్చారు? అనే వివరాలను కలెక్టర్ హెడ్ మాస్టర్ ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లి తండ్రులు వలసలు వెళ్తున్న సమయంలో పిల్లలను కూడా వారితో తీసుకొని వెళ్తే మీరు విద్యార్థుల తల్లి తండ్రుల వద్దకు వెళ్ళి పిల్లవాడిని ఆ విధంగా పిల్చుకొని వెళ్తే చదువు దెబ్బతింటుందని, చదువుకుంటే మంచి స్థానంలో ఉంటారు అని అవగాహన కల్పించాలని కలెక్టర్ హెడ్ మాస్టర్ ను ఆదేశించారు. వంట గదిని పరిశీలిస్తూ ఈరోజు ఏ భోజనం చేశారు ? మెనూ ప్రకారమే భోజనం చేస్తున్నారా? అని కలెక్టర్ వంట సిబ్బందిని ఆరా తీశారు. కలెక్టర్ స్వయంగా వండిన అన్నం, స్వీట్ పొంగల్ రుచి చూసి మరింత ఉడికించాలని కలెక్టర్ వంట సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల తల్లి తండ్రులతో కలెక్టర్ మాట్లాడుతూ ఇక్కడ ఉపాధ్యాయులు ప్రతిరోజు పాఠశాలకు వస్తున్నారా ? పిల్లలకు ఏ విధంగా పాఠాలు చెబుతున్నారు? ఏమైనా సమస్యలు ఉన్నాయా ? అని కలెక్టర్ విద్యార్థుల తల్లి తండ్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాఠాలు ఏ విధంగా చెబుతున్నారు? అర్థమయ్యే రీతిలో చెబుతున్నారా? బాగా చదువుకొని జీవితంలో మీరు పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.
సీజనల్ వ్యాధులు రాకుండా ఫాగింగ్ చేయించండి.
ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ సోర్స్ మొదలు నుండి టైల్ ఎండ్ వరకు క్లోరినేషన్ పరీక్షలు తప్పకుండా చేయాలి.
కలెక్టర్ సచివాలయాన్ని తనిఖీ చేస్తూ సచివాలయం లో ఉన్న సిబ్బంది గురించి అడిగి తెలుసుకున్నారు. సచివాలయం ద్వారా ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు అని ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదులు వస్తున్నాయని కలెక్టర్ పంచాయతీ కార్యదర్శి ని ఆరా తీశారు. నీటి సమస్య ఏమైనా ఉందా? అని అడిగారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ సోర్స్ మొదలు నుండి టైల్ ఎండ్ వరకు క్లోరినేషన్ పరీక్షలు తప్పకుండా చేయాలన్నారు. వాటర్ సోర్స్ వద్ద బ్లీచింగ్ చేయాలని, సీజనల్ వ్యాధులు రాకుండా ఫాగింగ్ ఆపరేషన్ చేయాలని కలెక్టర్ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. రోడ్లు వేసే సమయంలోనే డ్రెయిన్లు కూడా వేసే విధంగా ప్రణాళిక తయారు చేసుకోవాలని కలెక్టర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ను ఆదేశించారు. త్రాగునీటి పైప్ లైన్ చెక్ చేసి, ఒకవేళ ఏమైనా మరమ్మతులు ఉంటే చేయించాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ని ఆదేశించారు. ఇంటింటినుండి చెత్త సేకరణ పనులు ఖచ్చితంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పంచాయతీ సెక్రటరీ నీ ఆదేశించారు. ప్రతి ఇంటిలో చెత్తను తడి, పొడి చెత్తలుగా విభజించి పెట్టుకునే విధంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సర్పంచ్ కి సూచించారు. ఈ క్రాప్ బుకింగ్ ఎంత వరకు చేశారని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి ఐసిడిఎస్ పిడి విజయ, డిఆర్డిఏ పిడి రమణ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, డిపిఓ భాస్కర్, తహసిల్దార్ ప్రకాష్, ఎమ్ఈఓ సునంద, మైఖేల్, హెడ్ మాస్టర్ శేఖర్, సర్పంచ్ వరలక్ష్మి, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ నబీ సాయబ్, జడ్పీటీసీ సుభాషిని, తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!