యూనివర్సిటీ ధర్మ సత్రం కాదు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ బాబు

యూనివర్సిటీ ధర్మ సత్రం కాదు
చదువుల తల్లి ఉండే పవిత్ర దేవాలయం
యూనివర్సిటీ వాతావరణాన్ని వాణిజ్య కార్యకలాపాల కోసం కలుషితం చేయవద్దు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ బాబు
ఉత్తరాంధ్ర ప్రతినిధి సెప్టెంబర్ 21 యువతరం న్యూస్:
జీవిఎంసీ కౌన్సిల్ తీర్మానంతో జైల్ రోడ్ లో ఉన్న ఫుడ్ కోర్ట్ తొలగించడం జరిగింది.
స్ట్రీట్ వెండర్స్ కు చట్టంలో రక్షణలు ఉన్నాయి. వాటి ప్రకారం జీవీఎంసీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుంది.
ఇది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు.
ప్రజల అభ్యర్థన మేరకే చర్యలు తీసుకున్నామని జీవీఎంసీ కమిషనర్ చెప్పారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు ఆంధ్ర యూనివర్సిటీలో స్థలం కేటాయించాలని కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు కోరుతున్నారు చాలా దురదృష్టకరం.
శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం లో వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఇస్తే విద్యావాతరణం కలుషితం అవుతుంది.
ఆంధ్ర విశ్వ విద్యాలయం చదువులమ్మ తల్లి నివసించే దేవాలయం.
ఎంతోమంది పేద బిడ్డలకు భవిష్యత్తునిచ్చిన దేవాలయం. అటువంటి వాతావరణాన్ని కలుషితం చేయాలని చూస్తే ఉపేక్షించం.
రాజకీయ పార్టీలు అటువంటి డిమాండ్స్ చేయకుండా ఉంటే మంచిది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం మన వారసత్వ సంపద దానిని మనం అందరం కాపాడుకోవాలి.
విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదిగిన వారికి ఆ నేల విలువ అర్థమవుతుంది.
అధికారులు రాజకీయ పార్టీలు ఆ దిశగా ఆలోచించకపోవడం మంచిది.