ఉల్లి రైతుల కన్నీళ్లు తుడిచిన సీఎం చంద్రబాబు నాయుడు
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

ఉల్లి రైతుల కన్నీళ్లు తుడిచిన సీఎం చంద్రబాబు నాయుడు
కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటోంది
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నంద్యాల ప్రతినిధి సెప్టెంబర్ 20 యువతరం న్యూస్:
రాష్ట్రంలో ఉల్లి ధరలు పతనంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పాడని,
ఉల్లి పంట పండించిన ప్రతి రైతుకు హెక్టారుకు రూ. 50,000 ఆర్థిక సాయం అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని
ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై రూ. 100 కోట్లకు పైగా భారం పడినా, రైతుల సంక్షేమం కోసం వెనుకడుగు వేయకూడదని అధికారుల సీఎం స్పష్టం చేశారని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు.
శనివారం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ ఖరీఫ్ సీజన్లో కర్నూలు జిల్లా లో 45. 278 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారని, ఈ ఆర్థిక సాయం ద్వారా 24,218 మంది రైతులు లబ్దిపొందుతారన్నారు.
ఎన్నికల ముందు ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి సాయంగా ఇస్తామని చెప్పిన విధంగానే మొదటి విడతలో రూ.7 వేలు జమ చేయడం జరిగిందని, ఇందుకు రూ.3,700 కోట్లు ప్రభుత్వం రైతులకు ఖర్చు చేసిందన్నారు.
మామిడి పంటకు కిలోకు రూ.4 చొప్పున రూ.260 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.
పొగాకు రైతుల నుంచి ప్రభుత్వమే 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేసిందని, ఇందుకు రూ.273 కోట్లు ఖర్చు అయిందని,
కోకో గింజలకు కిలోకు రూ.50లు చెల్లించిందని, దీనికోసం రూ. 50 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు.
కాఫీ సాగు చేస్తున్న గిరిజన రైతులకు బెర్రీ బోరర్ వ్యాప్తిని అరికట్టేందుకు కేజీ కాఫీ కి రూ. 50లు నష్టపరిహారం, ఎడాదికి రూ.5,000 ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఉల్లి రైతులకు అండగా నిలబడేందుకు కిలో రూ.12 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలును ప్రారంభించిందని, అంతే కాకుండా హెక్టారుకు రూ.10 వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందన్నారు.
ఈ 15 నెలల్లో రైతులకు 90 శాతం డ్రిప్ అందించే పథకాన్ని పునరుద్ధరించిందని,
భూసార పరీక్షలు ప్రారంభమై మ్యాట్రిషన్స్ను రైతులకు అందిస్తోందన్నారు.
దాన్యం కోనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు జమ చేస్తోందని, గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన రూ.1670 కోట్ల బకాయిలను కూడా సీఎం చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
యంత్ర పరికరాలను సబ్సిడీతో అందిస్తూ రైతులను అభివృద్ధి పధంలో నడిపినస్తుందని,
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ అందిస్తూ అండగా ప్రభుత్వం నిలబడిందన్నారు.
ఉల్లి రైతుల పట్ల జగన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహారించారని,
జగన్ రెడ్డి వైసీపీ పాలనలో ఉల్లి ధరలు ఒక్కసారిగా కిలోకు రూ.1- 4 వరకూ పడిపోయి రైతులు రోట్టెక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆమె అన్నారు.
క్వింటా ఉల్లి ధర రూ.517 కు పడిపోయిందని, రైతులకు కూలీ ఖర్చులకు కూడా గిట్టుబాటు కాని దుస్థితిలోకి జగన్ రెడ్డి ప్రభుత్వం నెట్టేపిందన్నారు.
ఎన్నికల సమయంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానంటు బీరాలు పలికి, ఏమి చెయ్యలేక మడం తిప్పాడన్నారు.
మహారాష్ట్రలో ఉల్లి వేలం ఆపాలని రైతులు హెచ్చరిస్తే కూడా… జగన్ రెడ్డి కనీస మద్దతు ధర చెప్పకుండా ప్యాలెస్లో విలాపాల్లో మునిగిపోయాడే తప్ప రైతు గోడు పట్టించుకోలేదన్నారు.
2018లో ఉల్లి ధరలు పతనం అయినప్పుడు 7,723 మంది రైతుల నుండి 2.77 లక్షల క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి రూ.7 కోట్లు చెల్లించి అండగా నిలిచింది టీడీపీ ప్రభుత్వమేనని,
2018లో 9,740 మంది రైతుల నుండి 3. 48 లక్షల క్వింటాలి కొనుగోలు చేసి రూ.6.45 కోట్లు రైతులకు అందించి ఆదుకుంది చంద్రబాబు ప్రభుత్వమేనని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గుర్తు చేశారు.
కానీ జగన్ రెడ్డి పాలనలో 2020లో ఉల్లి ధరలు పడిపోయినప్పుడు క్వింటాకు కేవలం రూ.770 మద్దతు ధర ప్రకటించి, ఒక్క రైతు దగ్గర సరైన విధంగా కొనుగోలు చేయకుండా పక్కన పడేశారని,
కేవలం 250 మంది రైతుల నుండి రూ.75 లక్షలతో కొంత ఉల్లిని కొనుగోలు చేసి రైతులను పూర్తిగా నిరాశపరిచాడని విమరించారు.
2019 నుంచి 2024 మధ్య కాలంలో అనేకసార్లు ఉల్లి ధరలు పతనమయ్యాయని,
ముఖ్యంగా 2023 డిసెంబర్ నుంచి 2024 మార్చి మధ్య ఉల్లి ధరలు దాదాపు 40 శాతం వరకు
రైతుల కష్టాలను అర్ధం చేసుకోని జగన్ రెడ్డి మాటలకే పరిమితమై నిలువునా రైతును ముంచిందనీ, కూటమి ప్రభుత్వం మాత్రం మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తోందనీ, రైతు శ్రమకు గౌరవం ఇచ్చి, వారికి న్యాయమైన ధరలు రావడానికి కృషి చేస్తోందని,
పంటలకు ధరలు పడిపోతే ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందనీ,
వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు భరోసా కల్పిస్తోందని, కూటమి ప్రభుత్వానికి రైతుల సమస్యల పరిష్కారం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ దూసుకుపోతుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్పష్టం చేశారు.