పామిడిలో హత్య- పోలీసుల అదుపులో నిందితులు

పామిడిలో హత్య- పోలీసుల అదుపులో నిందితులు
పామిడి సెప్టెంబరు 19 యువతరం న్యూస్:
మద్యం సేవించి తల్లితో తరచూ గొడవపడుతున్న తండ్రిని తల్లితో కలిసి తనయుడు హతమార్చిన సంఘటన అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు… పట్టణంలోని షాదీఖాన వెనుక బెస్తవీధిలో నివాసం ఉంటున్న బెస్త సుధాకర్ లారీ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఉరవకొండకు చెందిన మీనాక్షికి, సుధాకర్ కు 20 సంవత్సరాల క్రితం పెద్దలు వివాహం జరిపించారు. ఇటీవల బెస్త సుధాకర్ మద్యానికి బానిసయ్యాడు. ఇంటిని అమ్మేందుకు బెస్త సుధాకర్ ప్రయత్ని స్తుండడంతో భార్య మీనాక్షితో తరచూ గొడవలు జరిగేవన్నారు. ఇదే విషయంపై బుధవారం రాత్రి మద్యం సేవించి సుధాకర్ భార్య మీనాక్షి, మైనర్ కుమారుడుతో వాగ్వివాదానికి దిగాడన్నారు. ఆవేశంతో భార్య మీనాక్షి, మైనర్ బాలుడైన కుమా రుడు రోకలిబండతో తలకు కొట్టడంతో తీవ్ర రక్త గాయాల పాలై అక్కడికక్కడే మృ తి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలా నికి చేరుకొని సంఘటనపై ఆరా తీశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనాస్థలాన్ని రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఎస్ఏ అశోక్ కుమార్ తన సిబ్బందితో పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య మీనాక్షి, కుమారుడు ప్రకాష్, కుమార్తె సునీత ఉన్నారు. మృతుని తండ్రి బెస్త నడిపి సుంకన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.