సమాజ అభివృద్ధిలో మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసమే ‘స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం
జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య

సమాజ అభివృద్ధిలో మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసమే ‘స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం
జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య
కర్నూలు కలెక్టరేట్ సెప్టెంబర్ 15 యువతరం న్యూస్:
మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాలను, దేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ‘స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమం తీసుకొని రావడం జరిగిందని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పోస్టర్ ను జాయింట్ కలెక్టర్
ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం శక్తివంతమైన కుటుంబ నిర్మాణానికి కీలకమన్నారు. ఈ అభియాన్ ద్వారా మహిళల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడం, పోషకాహారంపై శ్రద్ధ చూపించడం, కుటుంబ స్థాయిలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఆరోగ్య- కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా సాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఆయుష్మాన్ మందిరాలు, ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తారన్నారు. ఆరోగ్యవంతమైన మహిళ అంటే ఆరోగ్యవంతమైన కుటుంబం, అదే బలమైన సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుందని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. మహిళలు, బాలికలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ డా. శాంతి కళా, డి ఆర్ ఓ సి.వెంకట నారాయణమ్మ, తదితరులు పాల్గొన్నారు.