ఆదర్శ రైతుకు దక్కిన సత్కారం
ఉత్తమ రైతుగా నిలుస్తున్న కప్పట్రాళ్ల మల్లికార్జున

ఆదర్శ రైతుకు దక్కిన సత్కారం
ఉత్తమ రైతుగా నిలుస్తున్న కప్పట్రాళ్ల మల్లికార్జున
దేవనకొండ సెప్టెంబర్ 14 యువతరం న్యూస్:
ఆదర్శ, ఉత్తమ రైతుగా కప్పట్రాళ్ల మల్లికార్జున ప్రకృతి వ్యవసాయం పాటిస్తూ పండ్ల తోటల పెంపకం నిర్వహిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్ హరిత హోటల్లో ముందడుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాతకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 30 మంది రైతులను వారు సన్మానించారు. వారిలో దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన మల్లికార్జున కు ఈ అవకాశం పొందటం తో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ , సినీ సంగీత ప్రముఖుడు ఆర్.పీ. పట్నాయక్ , వారిని సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబిస్తూ, హార్టికల్చర్లో బత్తాయి సాగును విస్తారంగా చేస్తూ మల్లికార్జున తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఉత్తమ రైతుగా గుర్తించి గతంలో ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశాన్ని కూడా కల్పించింది. మల్లికార్జున మాట్లాడుతూ
మా గ్రామాన్ని దత్తత తీసుకున్న ఈగల్ ఐజి ఆర్.కె. రవికృష్ణ ఐపీఎస్ సహకారంతో సే ట్రీస్ సంస్థ ద్వారా 30 ఎకరాల్లో చీని సాగు చేస్తున్నాను. ప్రస్తుత సమాజానికి అవసరమైన విధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ, చీని పంట సాగు చేస్తున్నాను. నేను ఒక రైతు బిడ్డగా వ్యవసాయాన్ని జీవనాధారంగా ఉంచుకొని, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవాలనుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశం వ్యవసాయ దేశం. వ్యవసాయం లేకుంటే వ్యవస్థలు లేవు అనేది నా నినాదం” అని అన్నారు.తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు సాధించే మెలకువలను అనుసరిస్తూ, మంచి దిగుబడులు సాధించాలని రైతులను కోరారు.తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో తోడ్పాటు ఇచ్చిందన్నారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే బక్కన నరసింహులు,మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి,రిటైర్డ్ అగ్రికల్చర్ శాస్త్రవేత్తలు, యూత్ ఫర్ యాంటీ కరెప్షన్, ముందడుగు ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు, రిటైర్డ్ వ్యవసాయ అధికారులు,తెలుగు రాష్ట్రాల రైతులు పాల్గొన్నారు.