ప్రజలకు ప్రయోజనం అందించేలా జర్నలిజం ఉండాలి

ప్రజలకు ప్రయోజనం అందించేలా జర్నలిజం ఉండాలి
సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్
వాస్తవాలతో జర్నలిజం కొనసాగించాలి
కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తి పాటి నాగరాజు
కర్నూలు టౌన్ సెప్టెంబర్ 14 యువతరం న్యూస్:
ప్రజలకు ప్రయోజనం అందించేలా జర్నలిజం ఉండాలని, విలేకరులు జర్నలిజం గౌరవాన్ని కాపాడాలని సి ఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ పేర్కొన్నారు.
ఆదివారం సాయంకాలం మౌర్య హోటల్ పరిణయ హాల్లో రెండవ రోజు విలేకరుల పునఃశ్చరణ ముగింపు సమావేశంలో చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ… 1996లో స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ 2014లో సి ఆర్ మీడియా అకాడమీగా పేరు మార్చడం జరిగిందని తెలిపారు. ప్రజాప్రయోజనాల కొరకు ఉపయోగపడేది వార్త అని తెలుపుతూ ఈరోజు ఏడు మంది మీడియా నిపుణులతో శిక్షణ ఇప్పించడం జరిగిందని తెలిపారు. ఈ శిక్షణను వినియోగించుకొని జర్నలిజం గౌరవాన్ని తగ్గించకుండా ప్రజలతో, వ్యవస్థలతో వ్యవహారం మంచిగా ఉంచుకొని చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని విలేకరులను కోరారు. ఆత్మ విమర్శ చేసుకుని జర్నలిజం చేయాలని విలేకరులకు ఈ సందర్భంగా సూచించారు.
ఈ శిక్షణ ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి పార్లమెంట్ సభ్యులు బస్తి పాటి నాగరాజు మాట్లాడుతూ… జర్నలిజం చాలా గొప్పదని తెలిపారు. నా దినచర్య పత్రికలతో మొదలవుతుందని నా ఎంపీ పరిధిలో ఉన్న ఏడు శాసనసభ స్థానాల్లో జరుగుతున్న విశేషాలను పత్రికల ద్వారా నేను తెలుసుకొని వాటిపై చర్యలు తీసుకుంటూ ఉంటానని తెలియజేశారు. నా జర్నీ జర్నలిస్టులతోనే అని తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అన్ని విషయాలను అవగతం చేశారని, విలేకరులు వాస్తవాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలను రాయాలని మరియు చూపించాలని ఆ విధంగా చేసి 2047 కి ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరిక మేరకు దేశంలోని అగ్రగామిగా నిలిపే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా మాట్లాడుతూ… మీకు ఇచ్చిన ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా మీరు పనిచేస్తున్న వార్తా సంస్థ మరియు దేశానికి మంచి పేరు తీసుకుని రావాలని తెలిపారు. ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో సమాచారం సంక్షిప్తంగా సూటిగా ఉండేలాగా నైపుణ్యం ప్రదర్శించి, ఈ శిక్షణ ను సద్వినియోగం చేసుకుని వృద్ధి లో కి రావాలని కోరారు.
ఈ సందర్భంగా అతిథులు శిక్షణ పొందిన విలేకరులకు సర్టిఫికెట్ల పంపిణీ చేశారు.
ఈ సమావేశానికి కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు , కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా,సి ఆర్ మీడియా అకాడమీ సెక్రటరీ మణిరామ్ , సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ, రిసోర్స్ పర్సన్లు సోమ సుందరం, శంకర నారాయణ, ఉమా మహేశ్వర రావు, ఐ.వి.సుబ్బారావు, శ్రీనివాసరెడ్డి, ఏపీయూడబ్ల్యూజె జిల్లా ప్రతినిధులు కొండప్ప, రాజు, నాగరాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.