ఇంటర్నేషనల్ అవార్డుల గ్రహీత ఫోటోగ్రాఫర్ “గోలి”కి సత్కారం

ఇంటర్నేషనల్ అవార్డుల గ్రహీత ఫోటోగ్రాఫర్ “గోలి”కి సత్కారం
మంగళగిరి ప్రతినిధి సెప్టెంబర్ 14 యువతరం న్యూస్:
పెదవడ్లపూడిలో ఫోటోగ్రఫీలో ఇంటర్నేషనల్ అవార్డులు పొందిన గ్రామానికి చెందిన గోలి వెంకట శివ కుమార్ ను గ్రామ మాజీ సర్పంచ్, టీడీపీ శాశ్వత సభ్యులు అన్నే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్, నాయకులు వెంకట శివకుమార్ ను శాలువాలతో సత్కరించి బొకేలు అందజేశారు. అనంతరం అన్నే మాట్లాడారు. వెంకట శివకుమార్ 30 సంవత్సరాలు నుంచి స్టూడియో నడుపుకుంటూ తన జీవనోపాధితో పాటు సామాజిక స్పృహతో కూడిన కళాత్మక నైపుణ్యం ఉందన్నారు. ఫోటోగ్రఫీలో వెంకట శివకుమార్ 256 ఇంటర్నేషనల్ అవార్డ్స్, 36 గోల్డ్ మెడల్స్, 9 నేషనల్ హానర్స్ సంపాదించడం నియోజకవర్గానికి, గ్రామానికి గర్వకారణం అన్నారు. ఫోటోగ్రఫీలో ఆయన కళాత్మకతను రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు, నాయకులు జవ్వాది ఆంజనేయులు, గడ్డిపాటి సాంబశివరావు, శృంగారపాటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.