ఇబ్రహీం సేవలకు గుర్తింపు

ఇబ్రహీం సేవలకు గుర్తింపు… దానబోయిన
మంగళగిరి ప్రతినిధి సెప్టెంబర్ 14 యువతరం న్యూస్:
మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ గుడ్ విల్ ముస్లిం సంక్షేమ కార్యాలయం వద్ద ఇటీవల రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన మహమ్మద్ ఇబ్రహీం ను ఆదివారం టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి దానబోయిన సుందరరావు యాదవ్ ఆధ్వర్యంలో దేశం నాయకులు సత్కరించారు. దానబోయిన, నాయకులు ఇబ్రహీం ను శాలువాలతో సత్కరించి బొకేలు అందజేశారు. అనంతరం దానబోయిన మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీలో వివిధ పదవులు నిర్వహించి ఇబ్రహీం పార్టీ అభివృద్ధికి కృషి చేశారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఆయన సేవలను గుర్తించి డైరెక్టర్ పదవితో గౌరవించడం అభినందనీయమన్నారు. ఇబ్రహీం కు పదవి ఇవ్వడం పార్టీలో సీనియర్లకు ఇస్తున్న గుర్తింపుకు నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రుద్రు శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, మురళి, తోట శ్రీను బాబు, కొల్లి వెంకట్రావు, రుద్రు నాగరాజు, కొత్త శ్రీనివాసరావు, చింకా కోటేశ్వరరావు, పేరుబోయిన వెంకటేశ్వరరావు, తోట రమేష్, శ్రీను, సురేష్, పణిదపు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.