వృద్ధులకు దుప్పట్లు పంపిణి

వృద్ధులకు దుప్పట్లు పంపిణి
మంగళగిరి ప్రతినిధి సెప్టెంబర్ 14 యువతరం న్యూస్:
మంగళగిరి మున్సిపల్ వాటర్ ఫిల్టర్ బెడ్ వెనక ఉన్న ముక్తినాథ్ వృద్ధుల ఆశ్రమంలో టీడీపీ నాయకులు స్వర్గీయ ఆరుద్ర బోయరాజు వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక తులసీ వనం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. బోయరాజు స్నేహానికి విలువ నిచ్చే మంచి వ్యక్తి అని, పలు సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తమ వంతు ఆర్థిక సహకారం అందించేవారన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివ శేషగిరిరావు, శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు సుఖమంచి గిరిబాబు, నాయకులు చీకుల వెంకటేశ్వరరావు, పిల్లెళ్ళ నాగరాజు, తాడిబోయిన శ్రీకాంత్, గోపాల్, అందే శ్రీకాంత్, కురాకుల గోపి, పీడీ రాజు తదితరులు పాల్గొన్నారు.