పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తల నుంచి అందిన దరఖాస్తులకు అనుమతులు వెంటనే జారీ చేయాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్

పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తల నుంచి అందిన దరఖాస్తులకు అనుమతులు వెంటనే జారీ చేయాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్
నంద్యాల బ్యూరో సెప్టెంబర్ 10 యువతరం న్యూస్:
సింగిల్ డెస్క్ విధానం ద్వారా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుండి అందిన దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు జారీ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ సంబంధిత అధికారులకు సూచించారు.
బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సి .విష్ణు చరణ్ మాట్లాడుతూ… జిల్లాలో గత త్రైమాస కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం 1094 దరఖాస్తులు అందగా సింగల్ డిస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 1076 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారని ఇంకా మిగిలిన 17 దరఖాస్తులను నిర్దిష్ట గడువులోపు తగిన పరిష్కారం అందించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో చిన్న మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహం కొరకు పెట్టుబడి రాయితీ పావలా వడ్డీ విద్యుత్తు సేల్ టాక్స్ తదితర రాయితీల కింద జిల్లాలో ఉత్పాదన సేవా రంగాల్లోని 20 యూనిట్లకు మొత్తం 350.48 లక్షల విలువైన రాయితీ ప్రయోజనాల జారీకి కమిటీ ఆమోదం తెలియజేసింది.
ఈ సమావేశం నందు సభ్యులకు నూతనంగా ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానముల ఆచరణ కొరకు విడుదల చేసిన విధి విధానాలను వివరించి నూతన పరిశ్రమల స్థాపనకు వారు సహకరించవలసిందిగా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎస్ మహబూబ్ బాషా, ఎల్డీఎం రవీందర్ కుమార్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కిషోర్ రెడ్డి, రవాణా శాఖ అధికారి మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.