ANDHRA PRADESHOFFICIALWORLD
జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేద్దాం

జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేద్దాం
రేపల్లె ఆగస్టు 31 యువతరం న్యూస్:
అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సెప్టెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేద్దామని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఎస్ పి డి వెన్నెల పేర్కొన్నారు. స్థానిక కోర్టు మందిరంలో రెవెన్యూ, మున్సిపాలిటీ, బిఎస్ఎన్ఎల్, బ్యాంకు అధికారులతో న్యాయమూర్తి సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల్లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేలాగా కక్షిదారులకు అవగాహన కలిగించాలని సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వి. దివ్యసాయి శ్రీవాణి, ప్రభుత్వ న్యాయవాది జి. వెంకటేశ్వరరావు, పి. ఎన్.బి. శర్మ, కె. నాగంజనేయులు మరియు సంబంధిత న్యాయవాదులు, బ్యాంకు, రెవెన్యూ, మున్సిపాలిటీ, బిఎస్ఎన్ఎల్ అధికారులు పాల్గొన్నారు.