ANDHRA PRADESHDEVOTIONALWORLD
పేటేరులో వేడుకగా గణపతి ఉత్సవాలు

పేటేరులో వేడుకగా గణపతి ఉత్సవాలు
రేపల్లె ఆగస్టు 28 యువతరం న్యూస్:
వినాయక చవితి సందర్భంగా బుధవారం రేపల్లె మండలంలోని మేజర్ పంచాయతీ పేటేరు గ్రామంలో వీధి వీధిలో గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి)ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన కూడలిలో మండపం ఏర్పాటుచేసి విఘ్నేశ్వరునికి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో విహెచ్పి సభ్యులు జి కుటుంబరావు, పినపాల సత్యసాయి బాబు, ఎం కె ప్రసాద్, సిహెచ్ కిషోర్, సుగ్గుల సుందరయ్య, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.