వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న జనసేన శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్

వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న జనసేన శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్
ప్రజల విజయాలకు గణనాథుని ఆశీర్వాదం కలగాలని ఆకాంక్షించిన జనసేన ఎమ్మెల్యే
ఉత్తరాంధ్ర ప్రతినిధి సెప్టెంబర్ 28
యువతరం న్యూస్
విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ బుధవారం వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలలో పాల్గొన్నారు.
జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్, నీలమ్మ వేప చెట్టు వద్ద జీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకలకు హాజరైన ఆయన, అనంతరం జనసేన పార్టీ సీతంపేట కార్యాలయంలో నిర్వహించిన మహోత్సవంలో పాల్గొన్నారు. అలాగే ఆంధ్రా యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్ వద్ద జరిగిన గణనాథుని వేడుకల్లోనూ స్వామివారి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “గణనాథుని కృప కటాక్షాలతో ప్రజల జీవితాల్లో ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయాలు సాధించాలి” అని ఆశీర్వచనమిచ్చారు.
కార్యక్రమాల్లో నిర్వాహకులు, జనసేన శ్రేణులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.