శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారికి 6 పేటల బంగారు చైను బహుకరణ

శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారికి 6 పేటల బంగారు చైను బహుకరణ
ఉత్తరాంధ్ర ప్రతినిధి ఆగస్టు 22 యువతరం న్యూస్:
శ్రీకాకుళం జిల్లా నివాసి, శ్రీ లక్ష్మీనరసింహ మోటార్స్ అధినేత వైశ్యరాజు రాజారాం కిరణ్ రాజ్ తమ గాఢమైన భక్తి భావంతో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారికి బహుమతిని సమర్పించారు.
సుమారు 49 గ్రాముల బరువైన శంఖం-చక్ర నామాలతో అలంకరించిన 6 పేటల బంగారు చైనును ఆయన ఆలయానికి విరాళంగా అందజేశారు.
ఈ కానుకను ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధా, ప్రధాన అర్చకులు శ్రీనివాస్ ఆచార్యులు, పర్యవేక్షణాధికారి త్రిమూర్తులు సమక్షంలో ఆలయానికి సమర్పించారు.
ఆలయ సంప్రదాయం ప్రకారం దాతకు ప్రత్యేక దర్శనం కల్పించగా, అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
దాత చేసిన ఈ ఉదార విరాళానికి ఆలయ అధికారులు కృతజ్ఞతలు తెలుపుతూ – “ఇలాంటి భక్తి ఇతర భక్తులకు స్ఫూర్తిదాయకం” అని అభినందించారు.