వెల్దుర్తి మేజర్ పంచాయతీ సర్పంచ్ మరియు కుటుంబ సభ్యులపై ఉప సర్పంచ్ నాయకంటి శ్వేత ధ్వజం
అభివృద్ధి కన్నా, అవినీతిపై మక్కువ ఎక్కువ


వెల్దుర్తి మేజర్ పంచాయతీ సర్పంచ్ మరియు కుటుంబ సభ్యులపై ఉప సర్పంచ్ నాయకంటి శ్వేత ధ్వజం
వెల్దుర్తి ఆగస్టు 20 యువతరం న్యూస్:
మండల కేంద్రమైన వెల్దుర్తి మేజర్ పంచాయతీ కార్యాలయంలో ఉపసర్పంచ్ నాయకంటి శ్వేత మంగళవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెల్దుర్తి మేజర్ పంచాయతీలో అవినీతి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు. అవినీతికి నిలయంగా సర్పంచ్ మరియు కుటుంబ సభ్యులు మారిపోయారని ఆరోపించారు. అభివృద్ధి కన్నా అవినీతిపై సర్పంచ్ తో పాటు కుటుంబ సభ్యుల దృష్టి ఉందన్నారు. చాలా సందర్భాలలో వార్డు మెంబర్స్ సంతకాలు ఫోర్జరీ చేశారని ఆమె ఆరోపించడం జరిగింది. పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ఆదేశాలతో 13 మందిని వెల్దుర్తి మేజర్ పంచాయతీలో వర్కర్లు గా నియమిస్తే దాదాపు 6 నెలల నుండి జీతాలు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. మేజర్ పంచాయతీలో లక్షల రూపాయల నిధులు ఉన్న జీతాలు ఎందుకు ఇవ్వడంలేదని ఆమె నిలదీశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పంచాయతీ నిధులు సర్పంచ్ మరియు కుటుంబ సభ్యులు పక్కదారి పట్టించారని ఆమె విమర్శలు గుప్పించారు. పనిచేయని వారి పేర్ల మీద డబ్బులు తింటున్నారని ఆమె పేర్కొన్నారు. స్వయంగా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా మేజర్ గ్రామపంచాయతీ జరుగుతున్న అవినీతి ఆరోపణల పై చాలామంది జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కానీ నేటి వరకు చర్యలు తీసుకోవడంలో జాప్యంపై వెల్దుర్తి ప్రజలకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.



