ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన బ్రిటిష్ కాలంనాటి నాణేలు

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన బ్రిటిష్ కాలంనాటి నాణేలు
బద్వేలు ప్రతినిధి ఆగస్టు 14 యువతరం న్యూస్:
మైదుకూరు మున్సిపాలిటిలోని శెట్టి వారి పల్లె గ్రామంలో బ్రిటిష్ కాలం నాటి నాణేలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయని రచయిత,చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ మీడియాకు తెలిపారు.
కొన్ని మాసాల క్రితం శెట్టి వారి పల్లి గ్రామంలో గ్రామ దేవత పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ట ,నూతన దేవాలయం కట్టించారున్నారు. అప్పుడు ఈ పోలేరమ్మ విగ్రహంకిందస్వాతంత్రానికి ముందు (బ్రిటిష్ కాలం నాటి) 1911 నుంచి 1945 వరకు ఉన్న నాణేలు ఉన్నాయని చెప్పారు.
కాపర్ ,సిల్వర్ తో తయారుచేసిన ఆనాటి కాలంలోని క్వార్టర్ అణా, ఒక్క అణా, వన్ పైస్ లభ్యమైనట్లు తెలిపారు. వన్ పైస్ నాణేనికి మధ్యలో రంద్రం ఉందన్నారు.
శెట్టి వారి పల్లి గ్రామంలో మొట్టమొదటగా పోలేరమ్మ తల్లి విగ్రహo కొద్దిగా చిత్రమవ్వటంతో ఊరి పెద్దలు నూతన విగ్రహాన్ని ప్రతిష్టచేశారని వివరించారు. ఆనాటి విగ్రహమే తిరిగి పునః ప్రతిష్ట కొన్ని మాసాల క్రిందట చేశారని తెలిపారు.
ఈ నాణేల గురించి శెట్టి వారి పల్లె గ్రామానికి చెందిన కొప్పర్తి మహేశ్వర్ రెడ్డి, కొప్పర్తి కిరణ్ కుమార్ రెడ్డి, దంత వైద్యులు కొప్పర్తి కేఎన్ఆర్ లు సమాచారం ఇచ్చారని ఆయన వెల్లడించారు.