కంబాలపాడు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినిలకు వంటలు నేర్పబడును
చదువు బదులు వంట నేర్పుతున్న సంఘటన

విద్యార్థినిలచే వెట్టి చాకిరి
కంబాలపాడు బాలికల గురుకుల పాఠశాలలో ఆలస్యంగా వెలుగు చూసిన వైనం
చదువు బదులు వంటలు నేర్పిస్తున్న వైనం
పేద విద్యార్థినిలకు చదువు అవసరం లేదా
పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ సొంత మండలంలో సంఘటన
వెల్దుర్తి ఆగస్టు 14 యువతరం న్యూస్:
క్రిష్ణగిరి మండలంలోని కంబాల గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినిలకు చదువు సంగతి దేవుడు ఎరుగు వంటలు మాత్రం బాగా నేర్పిస్తున్నారని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. పేదలు తమ చిన్నారులను చదివించుకునేందుకు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినిలను చేర్పించడం జరిగింది. తాము చదువుకో లేకపోయినా తమ చిన్నారులైన చదువుకొని విద్యావంతులు కావాలని ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుండి పాఠశాలలో చేర్పించడం జరిగింది. పాఠశాలలో వంట మనుషులు ఉన్న చిన్నారి విద్యార్థినిలచే వంటలు చేయించడం గమనించదగ్గ విషయం. పాఠశాలలో ఉపాధ్యాయిని లు చదువులు నేర్పుతున్నారా లేక వంటలు నేర్పిస్తున్నారా అనే అనుమానం విద్యార్థినిల తల్లిదండ్రులకు కలగడం సహజం. పూరీలను సైతం నూనెలో విద్యార్థినిలు కాల్చడం ఆశ్చర్యకరంగా ఉంది. ఆ సమయంలో విద్యార్థినిలకు ఏదైనా సంఘటన జరిగితే బాధ్యులు ఎవరన్నది ప్రశ్న. అసలు విద్యార్థినిలచే వంటలు చేయించవచ్చా అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ సొంతం మండలంలో అధికారుల తీరు ఇలా ఉంటే ఇతర మండలాలలో పరిస్థితి ఏమిటని నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తమ చిన్నారులకు వంట నేర్పించాలి అనుకుంటే తాము తమ చిన్నారులను పాఠశాలకు ఎందుకు పంపించాలని విద్యార్థినిల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువు బదులు వంట నేర్పిస్తామని బోర్డు పెట్టుకుంటే సరిపోతుందని విద్యార్థినిల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను వంటకు పురమాయించిన వారిని మరియు సంబంధిత అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.