విద్య ద్వారా నిరక్షరాస్యతను అంతం చేయాలి

విద్య ద్వారా నిరక్షరాస్యతను
అంతం చేయాలి
చెట్లను, అడవులను రక్షించాలి
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క
ములుగు ప్రతినిధి ఆగస్టు11 యువతరం న్యూస్:
విద్య ద్వారా నిరక్షరాస్యతను అంతం చేయాలని, విద్యార్థులకు విద్య అందించడం ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపవచ్చని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు,ఆదివారం తాడ్వాయి మండలం మండల తోగు లో నూతనంగా నిర్మించిన పాఠశాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి , గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో ప్రారంభించారు, సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గుత్తికోయ గూడాలలో చిన్నారులకు విద్య అందించాలని ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఆలోచిస్తుందని,
ప్రాంతం అభయ అరణ్యం లో ఉండడం ద్వారా అనుమతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని,
తరుణంలోనే ప్రాంతంలోని పిల్లలకు విద్యను అందించాలనే సంకల్పంతో పీపుల్ హెల్పింగ్ సెంటర్ ఎన్ జి ఓ సంతోష్ 2020 కరోనా నుంచి ఈ ప్రాంతంలో మాతో కలిసి తమ సేవలను అందిస్తున్నాడని,
చక్రవర్తి హాస్పిటల్ యాజమాన్యం గతం సంవత్సరం లో తక్కలపాడు లో స్కూల్ నిర్మించారని, ఆదివారం ఇక్కడ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, సహకరించడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు,
విద్య అందరి ప్రాథమిక హక్కు అని, గిరిజన ప్రాంతాలలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పిస్తూ, విద్యను అందించడం జరుగుతుందని అన్నారు, అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి, కలెక్టర్
భోజనం చేశారు, కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ డి ఎస్ పి రవిందర్, చక్రవర్తి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా. తరుణ్ రెడ్డి, మండల అధికారులు, ఎన్ జి ఓ సంతోష్, తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.