శ్రీశైల మహా పుణ్యక్షేత్రం నందు శివపద సంకీర్తనోత్సవం

శ్రీశైల మహా పుణ్యక్షేత్రం నందు శివపద సంకీర్తనోత్సవం
శ్రీశైలం ప్రతినిధి ఆగస్టు 11 యువతరం న్యూస్:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రం నందు శ్రావణ మాసోత్సవాలలో భాగంగా దేవస్థానం ఆదివారం రోజున శివపద సంకీర్తన ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు రచించిన ‘శివపదం’ సంకీర్తనలను ప్రముఖ నేపధ్య గాయకులైన శ్రీ నిహాల్ గారి బృందం ఆలపించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయబడింది.
ఈ సందర్భంగా కార్యనిర్వాహణ అధికారి ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైకర్యాలన్ని పరిపూర్ణంగా జరగాలని భావనతో దేవస్థానం నిత్య కళారాధనగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుందన్నారు. హరికథ సాంప్రదాయ నృత్యం వాయిద్య సంగీతం భక్తి రంజని లాంటి గాత్రకచేరి లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంతోమంది కళాకారులను దేవస్థానం ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. శ్రావణ మాస ఉత్సవాలను పురస్కరించుకొని శివపదం సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు తదేక దీక్షతో రోజుకు 1 తక్కువ కాకుండా శివార్పణంగా చేయబడినట్లు పదాలకు పైగా శివ కీర్తనలను రచించినన్నారు. ఈ కీర్తనలే శివపదం పేరుతో ప్రసిద్ధి చెందాయన్నారు.
కాగా ఈనాటి సంకీర్తన కార్యక్రమంలో నేపథ్య గాయకులైన నిహాల్ బృందంలోని జేవిఎస్సార్ ఎస్ ప్రసాద్ సర్వజ్ఞ కార్తీక సబ్మిస్ట తన్వి శ్రీ శృతి ఆయా సంకీర్తనను ఆలపించనున్నారు.
33,000 గణపతి ఏ గణపతియే శివ శివ మహాలింగా పార్వతీ శంకరులు నమశ్శివాయ ఇది ప్రదోషవేల పంచామృతాలతోనూ శివకామ సుందరి నమో నమో ఉమాపతి మొదలైన కీర్తనలను గాయని గాయకులు ఆలపించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి మృదుంగ సహకారాన్ని తీపి బాలసుబ్రమణ్యం మరియు వయోలిన్ సహకారాన్ని కౌండిన్య అందిస్తున్నారు.