ఆరాధనకు తిక్కారెడ్డికి పీఠాధిపతుల ఆహ్వానం

ఆరాధనకు తిక్కారెడ్డికి పీఠాధిపతుల ఆహ్వానం
మంత్రాలయం ప్రతినిధి జూలై 25 యువతరం న్యూస్:
శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలకు రావాలని టిడిపి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి కి శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు ఆహ్వానించారు. గురువారం అమావాస్య తిథి సందర్భంగా స్వామి దర్శనార్థమై శ్రీ మఠం చేరుకున్న ఆయనకు ఆ పార్టీ మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి సీనియర్ నాయకులు పూజారి వ్యాసరాజాచార్ లు స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని మంగళ హారతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు సుభుదేంద్రతీర్థులు వారికి శేష వస్త్రం ఫల మంత్రాక్షతలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఆగష్టు 08 వ తేదీ నుండి 14 వ తేదీ వరకు శ్రీ మఠం లో జరుగనున్న శ్రీ రాఘవేంద్రస్వామి సప్త రాత్రోత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆయన వెంట టిడిపి నాయకులు క్లస్టర్ ఇంచార్జీ ఎల్లారెడ్డి మీడియా కోఆర్డినేటర్ విజయరామిరెడ్డి బిసి సెల్ జనరల్ సెక్రటరీ వట్టెప్ప గారి నరసింహ హండే అనుమంతు గనేకంటి రామకృష్ణ సాతనూరు ఉలిగయ్య తదితరులు ఉన్నారు.