ఎస్పీ నుంచి ప్రశంసా పత్రం అందుకున్న సిఐ రామాంజులు

ఎస్పీ నుంచి ప్రశంసా పత్రం అందుకున్న సిఐ రామాంజులు
మంత్రాలయం ప్రతినిధి జులై 25 యువతరం న్యూస్:
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమెన మంత్రాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామాంజులు ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో చేపట్టిన సమీక్ష సమావేశం అనంతరం ఎస్పీ ద్వారా ప్రశంసా పత్రం స్వీకరించారు. ఈ నెల 18 వ తేదీన మాధవరం గ్రామానికి చెందిన రచ్చమర్రి కొప్పురప్ప (45), అనే వ్యక్తి చనిపోవాలని తుంగభద్ర నదిలో దూకారని సమాచారం తెలుసుకున్న సిఐ రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బందిని అప్రమత్తం చేసి ఆయన్ను రక్షించి ప్రాణాలు కాపాడడమే కాక స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ట్రాఫిక్ కు నియంత్రణలో చేస్తున్న కృషి ని అభినందిస్తూ ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగిందని సిఐ రామాంజులు తెలిపారు.