శ్రీశైల మహా క్షేత్రం నందు పరోక్ష సేవగా శ్రీ బయలు వీరభద్ర స్వామి వారి విశేష పూజ

శ్రీశైల మహా క్షేత్రం నందు పరోక్ష సేవగా శ్రీ బయలు వీరభద్ర స్వామి వారి విశేష పూజ
శ్రీశైలం ప్రతినిధి జులై 24 యువతరం న్యూస్:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రం నందు గురువారం రోజు అమావాస్యను పురస్కరించుకొని లోక కళ్యాణ కోసం దేవస్థానం శ్రీశైల క్షేత్రపాలకుడైన శ్రీ బయలు వీరభద్ర స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నది. ఈ సాయంకాలం పూజారికాలు నిర్వహించబడతాయి.
ప్రతి మంగళవారం అమావాస్య రోజులలో ఈ విశేష అర్చనను జరిపించడం జరుగుతుంది.
కాగా అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్ష సేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం కల్పించబడింది.
గురువారం రోజున పరోక్ష సేవ ద్వారా 27 మంది భక్తులు ఈ విశేష పూజలను జరిపించుకుంటున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక హర్యానా తదితర ప్రదేశాల నుండి కూడా భక్తులు ఈ పూజలను జరిపించుకుంటున్నారు. కాగా ఈ పూజా అధికార కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా శ్రీ మహాగణపతి పూజను నిర్వహించబడుతుంది.
ఈ పూజారికాలలో పంచామృతాలతోనూ బిల్వోదకం కుంకుమోదకం హరిద్రోదకం బస్మోదకం గందోదకం పుష్పోదగం శుద్ధ జలాలతో శ్రీ బయలుదేరభద్ర స్వామివారికి అభిషేకం జరిపించబడుతుంది.
శ్రీ బయలు వీరభద్ర స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడతాయని హరిష్టాలని తొలగిపోతాయని ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని ప్రమాదాలు నివారించబడతాయని సర్వ కార్య సానుకూలత లభిస్తుందని అబిష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.
కాగా ఈ పరోక్ష సేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు ప్రసారాల సమయం మొదలైన వాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలియజేయడం జరుగుతుంది.
సేవాకర్తలే కాకుండా భక్తులందరూ కూడా వీటిని శ్రీశైలం టీవీ మరియు యూట్యూబ్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించబడుతుంది.
ఇతర వివరముల కోసం దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నెంబర్లు 83339 52/53 లను సంప్రదించవచ్చును.