ANDHRA PRADESHOFFICIAL

జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల బ్యూరో జూలై 25 యువతరం న్యూస్:

జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో… నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున వాతావరణ శాఖ సూచనలు దృష్టిలో ఉంచుకొని ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు గురువారం వివిధ శాఖల అధికారులకు ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ పలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా…

హాస్టల్ భవనాలలో శిథిలావస్థలో ఉన్న గదులలో పిల్లలను పడుకోనివ్వవద్దు.

పాఠశాలలు, కళాశాలలు & రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూట్‌లలోని శిథిలావస్థలో ఉన్న గదులలో తరగతులు నిర్వహించడానికి అనుమతించవద్దని సూచించారు.

అలాగే మట్టి ఇళ్లలో ఉండడానికి అనుమతించరాదు. దీనిని పక్కగా పర్యవేక్షణ చేయాలన్నారు. ఇట్టి అంశాలలో ఏదైనా అలసత్వం వహిస్తే తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!