230 మంది విద్యార్థులకు ఒకటే బస్సు
బస్సులో కళ్ళు తిరిగి పడిపోయిన విద్యార్థులు

విద్యార్థుల ప్రాణాలు అంటే ఆర్టీసీ అధికారులకు అంత నిర్లక్ష్యమా..!
230 మంది విద్యార్థులకు ఒకటే బస్సా
బస్సులో కళ్ళు తిరిగి పడిపోయిన విద్యార్థులు
దేవనకొండ జూలై 22 యువతరం న్యూస్:
విద్యార్థుల ప్రాణాలు అంటే ఆర్టీసీ అధికారులకు చులకన భావంతో, నిర్లక్ష్య ధోరణితో ఉన్నారని విద్యార్థుల తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. దేవనకొండ మండలం నుండి గద్దరాళ్ల, పల్లెదొడ్డి, ఓబుళపురం, జిల్లేడుబుడకల, మాధాపురం విద్యార్థులు చదువుకోవడానికి ప్రతిరోజు పాఠశాలల కు 230 మంది విద్యార్థులు ఒకే ఒక్క ఆర్టీసీ బస్సులో వెళ్తారు. అంత మంది విద్యార్థులకు ఒకే ఒక బస్సు ఉండడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. మంగళవారం బస్సులో ఊపిరాడక నలుగురు విద్యార్థులకు కళ్ళు తిరిగి కిందపడిపోయారు. గమనించిన కండక్టర్, జనసేన నాయకులు కృపాకర్ విద్యార్థులను కిందికి దించి ప్రథమ చికిత్స చేశారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు.విద్యార్థులకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు మరొక బస్సు ను ఏర్పాటు చేయాలని జనసేన నాయకులు కృపాకర్ డిమాండ్ చేశారు.