భారత ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను ఎన్ ఎల్ ఎం టీం సభ్యులకు వివరించాలి

భారత ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను ఎన్ ఎల్ ఎం టీం సభ్యులకు వివరించాలి
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
నంద్యాల బ్యూరో జూలై 20 యువతరం న్యూస్:
జిల్లాలో భారత ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను నేషనల్ లెవెల్ మానిటరింగ్ టీం సభ్యులకు క్లుప్తంగా వివరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులకు సూచించారు.
శనివారం కలెక్టరేట్ లోని తమ చాంబర్ నందు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఎన్ ఎల్ ఎం టీం సభ్యులు మరియు జిల్లా అధికారులతో భారత ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ… ఈనెల 19 నుంచి 29వ తేదీ వరకు జిల్లాలోని నంద్యాల, ఉయ్యాలవాడ, జూపాడుబంగ్లా, ఈ 3, మండలాలకు సంబంధించిన 8, పంచాయతీలలో నేషనల్ లెవెల్ మానిటరింగ్ టీం సభ్యులు క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరుగుతుందన్నారు. వీరికి మన జిల్లాలో భారత ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి వంటి విషయాలను క్షేత్రస్థాయిలో క్లుప్తంగా వివరించాలన్నారు.
ఇందులో ముఖ్యంగా వ్యవసాయ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతి రాజ్, హౌసింగ్, గ్రామపంచాయతీలలో అమలు చేసే డిజిటల్ పంచాయతీలు, ఎన్ఆర్ఈజీఎస్ పనులు, డిఆర్ డిఎ అమలు చేసే సంక్షేమ పథకాలకు సంబంధించిన పనులను అధికారులందరూ సమన్వయంతో కోఆర్డినేషన్ చేసుకొని వారికి చూపించాలన్నారు.
ఇందులో బెస్ట్ ప్రాక్టీస్ ఏమైనా ఉన్నట్లయితే అందుకు సంబంధించిన వీడియోలు, సమాచారాన్ని వారికి ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పిడి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ, వ్యవసాయ శాఖ, జిల్లా పంచాయతీ అధికారి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.