ANDHRA PRADESHOFFICIAL
బదిలీపై వెళ్తున్న రెవెన్యూ సిబ్బందికి ఘనంగా వీడ్కోలు


బదిలీపై వెళ్తున్న రెవెన్యూ సిబ్బందికి ఘనంగా వీడ్కోలు
యాడికి జులై 18 యువతరం న్యూస్:
యాడికి మండల తహసిల్దార్ కార్యాలయం లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన సివిల్ సప్లై డిప్యూటీ తహసిల్దార్ ఎం కే సూర్యనారాయణ, నలుగురు గ్రామ రెవెన్యూ అధికారులు , పన్నెండు మంది గ్రామ సర్వేయర్లకు గురువారం ఎంపీడీవో సమావేశ భవనంలో ముఖ్య అతిథిగా తహసిల్దార్ ప్రతాపరెడ్డి హాజరై రెవెన్యూ సిబ్బందికి పూలహారాలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ వీరితో ఉన్న అనుబంధాన్ని వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాసులు, ఆర్ఐ కిష్టప్ప, మండల సర్వేయర్ శేష సాయి, రెవెన్యూ సిబ్బంది దామోదర్ నాయుడు మౌలాలి పాల్గొన్నారు.



