ANDHRA PRADESHEDUCATION
పెండేకల్లు ఆర్ఎస్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

పెండేకల్లు ఆర్ఎస్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
తుగ్గలి జులై 13 యువతరం న్యూస్:
తుగ్గలి మండలం పరిధిలోని పెండేకల్లు ఆర్ఎస్ఎస్ లో ఆదివారము పూర్వ విద్యార్థుల సమ్మేళనము ఘనంగా జరిగింది. 1986-1987 బ్యాచ్కు చెందిన విద్యార్థుల అంత కలిసి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఆ బ్యాచ్ కి చెందిన విద్యార్థులు కలిసి విద్యార్థుల భోజన వసతుల కోసం షెడ్డును నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల మాట్లాడుతూ పెండేకల్లు ఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదవడం గర్వంగా ఉందన్నారు. పాఠశాలకు ఏదో చేయాలన్న తపనతో విద్యార్థుల భోజనాలు వసతుల కోసం షెడ్డు నిర్మించడం జరిగిందన్నారు. పాఠశాలకు మరిన్ని వర్షాతులను సమకూర్చడానికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.