
సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర అభివృద్ధి
ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్
తుగ్గలి జులై 13 యువతరం న్యూస్:
సూపర్ సిక్స్ పథకాలతో రాష్టం అభివృద్ధి జరుగుతుందని,గ్రామాల అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యమని పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాం కుమార్ అన్నారు.ఆదివారం మండలం పరిధిలోని ఎర్రగుడి “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విధ్వంసం నుండి వికాసం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పయనిస్తుందన్నారు.తల్లికి వందనం పథకం,దీపం పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి ఏట మూడు గ్యాస్ సిలిండర్లు,పింఛన్లు పెంపు, రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఆర్టీసీ బస్సులో మహిళాకు ఉచిత ప్రయాణం,రైతులకు అన్నదాత సుఖీభవ,నిరుద్యోగ భృతి అందిస్తామని వారు పేర్కొన్నారు. ఏడాదిలోని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ బత్తిన వెంకట రాముడు, బీసీ వెంకటస్వామి, బీసీ చంద్రశేఖర్ యాదవ్, తిమ్మయ్య చౌదరి, శ్రీనివాసులు గౌడ్,మనోహర్ చౌదరి, మాజీ ఎంపీపీ కొమ్ము వెంకటేష్,సర్పంచ్ ఓబులేసు, బాలన్న, మిద్దె వెంకటేష్, మిద్దె రవి, వల్లే వెంకటేష్, ఎడవల్లి తిమ్మప్ప, డీలర్ తిమ్మప్ప, ప్రతాప్ యాదవ్, చాంద్ బాషా, వివిధ గ్రామాలకు చెందిన టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.