భూకబ్జాలకు పాల్పడిన వారు ఎవరైనా కఠిన చర్యలు తప్పవు

భూకబ్జాలకు పాల్పడిన వారు ఎవరైనా కఠిన చర్యలు తప్పవు
బద్వేలు టిడిపి ఇన్చార్జి రితేష్ రెడ్డి
బద్వేలు ప్రతినిధి జూలై 12 యువతరం న్యూస్:
బద్వేల్ నియోజకవర్గంలో గత కొంతకాలంగా పేదల భూములపై దృష్టిసారించిన ముఠా… ఫోర్జరీ పత్రాలతో అమాయకుల భూముల కబ్జాకు పాల్పడుతోంది. ఇటీవలి కాలంలో బద్వేల్ పోలీసులు వీరిని అరెస్ట్ చేయడం జరిగింది, ఈ ఘటన పై స్పందిస్తూ ఈ దోపిడీపై తాను మొదటినుంచే పోరాటం చేస్తున్నానని టీడీపీ బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రితేష్ రెడ్డి పేర్కొన్నారు.
తాను నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయంలోనే గత ప్రభుత్వ హయాంలో అనేక భూములు కబ్జా చేయబడ్డాయని వాటిని తిరిగి వారికి అందేలా చూస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పేదల ఆస్తులను దోచుకుని దౌర్జన్యానికి పాల్పడిన వారిని ఎంతటి వారైనా… ఏ స్థాయి వారైనా కూటమి ప్రభుత్వం ఏ మాత్రం ఉపేక్షించదు అని రితేష్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ ఘటనపై పూర్తిస్థాయి పారదర్శక విచారణ జరిపి, నిందితులకు తగిన శిక్షలు విధించాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. బద్వేల్ ప్రజల ఆస్తులు భద్రంగా ఉండేలా కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని, ఇది మంచి పరిపాలనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.