మా ఆస్తులు ఏమైనా పోతున్నాయా…. ఇది రెవెన్యూ అధికారుల తీరు❓❓❓❓

మా ఆస్తులు ఏమైనా పోతున్నాయా…. ఇది రెవెన్యూ అధికారుల తీరు❓❓❓❓
పోయేది ప్రభుత్వ ఆస్తులే కదా….
నిర్లక్ష్యపు నీడన రెవెన్యూ అధికారులు
యదేచ్చగా ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 247లో భూ ఆక్రమణలు
ప్రభుత్వ భూమి 247లో వైసిపి నాయకుడు, వెల్దుర్తి సర్పంచ్ మరిది జగనన్న ఇళ్ల నిర్మాణం
వెల్దుర్తి జులై 2 యువతరం న్యూస్:
మా ఆస్తులు ఏమైనా పోతున్నాయా…. పోయేది ప్రభుత్వ ఆస్తులే కదా అన్న చందంగా వెల్దుర్తి మండల రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారని వెల్దుర్తి మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా తహసిల్దార్ కార్యాలయం ఎదురు గా ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 247లో వైసిపి నాయకుడు, వెల్దుర్తి మేజర్ పంచాయితీ సర్పంచ్ మరిది ఆక్రమించుకొని జగనన్న ఇళ్ల నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని ఐసిడిఎస్ కార్యాలయానికి దాదాపు రూ.8000 లకు అద్దెకి ఇవ్వడం మరి విడ్డూరంగా ఉంది. ఈ నిర్మాణాలకు ఇంటి పన్నును కూడా మంజూరు చేయడం గమనించదగ్గ విషయం. తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే చూసి చూడనట్లు వ్యవహరించడం అధికార తీరును ప్రజల ప్రశ్నిస్తున్నారు. మీ సొంత స్థలాలను ఎవరైనా ఆక్రమించుకుంటే ఇలాగే చూస్తూ ఊరుకుంటారా అని వెల్దుర్తి మండల ప్రజలు రెవెన్యూ అధికారులను నిలదీస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 247 రోడ్డు మరియు డొంకను కూడా ఆక్రమించి నిర్మాణం చేపట్టినట్లు ప్రజలు పేర్కొంటున్నారు. ఆక్రమణదారులపై రెవెన్యూ దారులకు ఎందుకింత ప్రేమ అని వెల్దుర్తి మండల ప్రజలు నిలదీస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు లేక అద్దె భవనాలలో కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను కాపాడవలసిన అధికారులే పరోక్షంగా ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు సహకరిస్తున్నారని వెల్దుర్తి మండలంలో ప్రజలు గుసగుసలాడుతున్నారు. ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 247 లో నిర్మించిన ఆక్రమణలపై చర్యలు తీసుకోకపోతే తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించవలసి వస్తుందని వెల్దుర్తి మండల ప్రజలు హెచ్చరిస్తున్నారు.