నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి

నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి
మార్పులు చేర్పులు చేసుకోవచ్చు
తహసిల్దార్ చంద్రశేఖర్ వర్మ
వెల్దుర్తి మే 8 యువతరం న్యూస్:
మండలంలో రేషన్ కార్డు లేని నిరుపేదలకు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పౌర సొరఫరాల శాఖ నూతనంగా రేషన్ కార్డులు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించిందని వెల్దుర్తి మండల తాహాసిల్దార్ చంద్రశేఖర్ వర్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తహసిల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ ,రేషన్ కార్డులకు సంబంధింత సేవలు పునః ప్రారంంభించడం జరిగిందిన్నారు. ఈ సేవలు ఈ నెల 7 తేదీ నుంచి ఈ నెల ఆఖరు వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించిందన్నారు.అలాగే రేషన్ కార్డు లో మార్పులు చేర్పులకు సంభందించి 7 సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు. ప్రధానంగా నిరుపేదలకు నూతనంగా రేషన్ కార్డు, రేషన్ కార్డు ఉండి మిగిలిన సభ్యులను కార్డులో పొందపరచెందుకు అవకాశం ఉందన్నారు. అలాగే కుటుంబంలో వివాహమై ఒకే రేషన్ కార్డు ఉన్న కుటుంబ సభ్యులు కూడా రేషన్ కార్డు పొందవచ్చున్నారు. రేషన్ కార్డు లో తొలగింపు కూడా అవకాశం ఉందన్నారు. అలాగే రేషన్ కార్డులో చిరునామా మార్పులు, రేషన్ కార్డులు తప్పులు, రేషన్ కార్డ్ సరెండర్ తదితర అన్ని సేవలు పొందుటకు పౌరసరఫరాల శాఖ అర్హులైన లబ్ధిదారులకు స్థానిక గ్రామ సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవచ్చని తహసిల్దార్
తెలిపారు. ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు నూతనంగా క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేస్తే ఆరు నెలల రేషన్ వివరాలు తెరిచేందుకు క్యూఆర్ కోడ్ తో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది అన్నారు. ఈ స్మార్ట్ కార్డుతో దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ గురుస్వామి రెడ్డి పాల్గొన్నారు.