ANDHRA PRADESHNEWSPAPER
స్వేచ్ఛాయుత మాధ్యమమే ప్రజాస్వామ్యానికి శక్తి

స్వేచ్ఛాయుత మాధ్యమమే ప్రజాస్వామ్యానికి శక్తి
ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యుడు ఖాసిం వల్లి
చింతపల్లి మే 3 యువతరం న్యూస్:
ప్రభుత్వ బాధ్యతలను గౌరవంగా గుర్తు చేస్తూ, ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా సమాజ హితం కోసం పనిచేస్తున్న పాత్రికేయులందరూ అభినందనీయులని చింతపల్లి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యుడు షేక్ ఖాసిం వలి అన్నారు. ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛ లోపించిన ప్రజాస్వామ్యం అసంపూర్ణం అన్నారు. కలం యోధుల గళానికి స్వేచ్ఛ ఉన్నప్పుడే పాత్రికేయులు నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు, ప్రభుత్వం ముందు ఉంచగలరని, స్వేచ్ఛాయుత మాధ్యమమే ప్రజాస్వామ్యానికి శక్తి అని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయ వ్యక్తం చేశారు.