పదవి వీరమణ పొందిన పోలీసులను సన్మానించిన …కర్నూల్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా

పదవి వీరమణ పొందిన పోలీసులను సన్మానించిన …కర్నూల్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా
కర్నూల్ క్రైమ్ ఏప్రిల్ 30 యువతరం న్యూస్:
సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పోలీసు సిబ్బంది పదవి వీరమణ పొందడం అభినందనీయమని కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా
తెలిపారు.
ఈ సంధర్బంగా బుధవారం పదవి వీరమణ పొందిన
1) కర్నూలు సిసిఎస్ – ఎస్సై బి .రమేష్ బాబు
2) ఎ ఆర్ ఎస్సై బి. కోటయ్య ,
3) ఎ ఆర్ ఎస్సై . ఎం రామ చంద్ర రావు
4) ఎ ఆర్ హెడ్ కానిస్టేబుల్ ఈ. రామాంజనేయులు ను జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు శాలువ, పూలమాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
కుటుంబాలతో సంతోషంగా గడపాలని, పదవివీరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ ఐలు జావేద్ , నారాయణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.