
వివాహిత ఆత్మహత్య
వెల్దుర్తి ఏప్రిల్ 19 యువతరం న్యూస్:
వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్ కొట్టాల గ్రామంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. వెంకటేశ్వర్లు, సుభాషిని అనే ఇరువురు దంపతులు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుభాషిని (25) పేడ రంగు కలుపుకొని తాను తాగి తన ఇద్దరు కూతుర్లకు కూడా తాగించినట్లు సమాచారం. గమనించిన ఇరుగుపొరుగు వారు కుటుంబ సభ్యులకు తెలపగా చికిత్స నిమిత్తం వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సుభాషిని మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కూతుర్లు మాన్యశ్రీ, విలక్షణ లను చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రావలసి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.



