విద్యార్థిని పై అసభ్యకర ప్రవర్తన

విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు పాల్పడిన కామాంధ ఉపాధ్యాయుడు పై ఫోక్సో యాక్ట్ కేసు నమోదు చేయాలి
లిటిల్ ఫ్లవర్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి
ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
డి.యం. ఓబులేసు యాదవ్ డిమాండ్
బద్వేల్ మార్చి 30 యువతరం న్యూస్:
లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు పాల్పడిన కామాంధ ఉపాధ్యాయుడు అన్వర్ పై ఫోక్సో యాక్ట్ కేసు నమోదు చేయాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డి. యం. ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో ఉన్న శివానగర్ లో లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న బాలికను అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అన్వర్ ఎవరూ లేని సమయంలో రూమ్ లోకి రమ్మని పిలిచి అసభ్యంగా, లైంగికంగా వేధించాడన్నారు.పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డం చాలా దారుణమని, ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అన్వర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపాలంటే భయభ్రాంతులకు గురవుతారని, మానవ మృగంలా విద్యార్థిని పై అసభ్యంగా ప్రవర్తించిన కామాందా ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ప్రయివేట్ విద్యాసంస్థలలో ఒక టీచర్ నియమ నిబంధనల ప్రకారం వారి చదువులకు సంబంధించిన అర్హతతో పాటు వారి వ్యక్తిగత జీవన అలవాట్లను, ప్రవర్తను గమించాలని అలాకాకుండా ఇష్టానుసారంగా తక్కువ జీతానికి ఎవరూ పని చేస్తారో వారి విద్యా ప్రమాణాలతో సంబంధం లేకుండా ఇంటర్, డిగ్రీ ఫెయిల్ అయిన వారిని, టీచర్ యొక్క అర్హత లేని వారిని నియమించడం కారణంగా ఈ ఘటన జరిగిందని ఆర్ఎస్ఎస్ భావిస్తుందని తెలిపారు.
తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్ల విద్యా అర్హత పత్రాలపై డీఈఓ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి పాఠశాలలో కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లు తనిఖీల నిర్వహించేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ని విజ్ఞప్తి చేశారు.