4 పార్కింగ్ ప్రదేశాలకు బహిరంగ వేలంపాట

4 పార్కింగ్ ప్రదేశాలకు బహిరంగ వేలంపాట
నగరపాలకకు రూ.16.03 లక్షల ఆదాయం
అనివార్య కారణాలతో 2 ప్రదేశాల వేలంపాట వాయిదా
కర్నూల్ మున్సిపాలిటీ మార్చి 28 యువతరం న్యూస్:
నగరంలో వివిధ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ప్రదేశాలకు నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు అధ్వర్యంలో గురువారం బహిరంగ వేలంపాట నిర్వహించారు. స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని కౌన్సిల్ హాల్లో ప్రశాంతంగా వేలంపాటలు ముగిసాయి. మొత్తం 6 పార్కింగ్ ప్రదేశాలకు బహిరంగ వేలంపాట నిర్వహించాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల రెండింటికీ వాయిదా పడ్డాయి. వినాయక ఘాట్ పార్కింగ్ ప్రదేశానికి ఎవరు పాట పాడటానికి ముందుకు రాకపోగా, నగరపాలక సంస్థ కార్యాలయంలోని పార్కింగ్ ప్రదేశానికి అనివార్య కారణాలతో వాయిదా వేశారు. మిగిలిన 4 పార్కింగ్ ప్రదేశాల వేలంపాట ద్వారా నగరపాలకకు రూ.16.03 లక్షల ఆదాయం సమకూరింది. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ, ఆర్‌ఓ జునైద్, సూపరింటెండెంట్ వాజిద్, ఆర్‌ఐలు తిప్పన్న, ఖలీల్, సుహైల్, డిపిఓ వినోద్, వందన, తదితరులు పాల్గొన్నారు.
ప్రదేశాలను దక్కించుకున్న లీజుదారులు:
కింగ్ మార్కెట్ కూరగాయల మార్కెట్ పార్కింగ్ ప్రదేశానికి ధరవత్తు రూ.6.35 లక్షలు నిర్ణయించగా, అత్యధికంగా పాట పాడి జి.యం.డి. ఖాజిం హుస్సేన్ రూ.6.80 లక్షలతో పార్కింగ్ ప్రదేశాన్ని దక్కించుకున్నారు.
కింగ్ మార్కెట్ పక్కనున్న చేపల మార్కెట్ పార్కింగ్ ప్రదేశానికి ధరవత్తు రూ.1.35 లక్షలు నిర్ణయించగా, అత్యధికంగా పాట పాడి టి.జి. రమేష్ బాబు రూ.1.45 లక్షలతో పార్కింగ్ ప్రదేశాన్ని దక్కించుకున్నారు.
కిడ్స్ వరల్డ్ పార్కింగ్ ప్రదేశానికి ధరవత్తు రూ.3.95 లక్షలు నిర్ణయించగా, అత్యధికంగా పాట పాడి వై.రామ్‌చరణ్ రూ.4.15 లక్షలతో పార్కింగ్ ప్రదేశాన్ని దక్కించుకున్నారు.
శ్రీనివాస క్లాత్ మార్కెట్ వద్ద పార్కింగ్ ప్రదేశానికి ధరవత్తు రూ.3.24 లక్షలు నిర్ణయించగా, అత్యధికంగా పాట పాడి వై.రామ్‌చరణ్ రూ.3.63 లక్షలతో పార్కింగ్ ప్రదేశాన్ని దక్కించుకున్నారు.