ANDHRA PRADESHBREAKING NEWSDEVOTIONALOFFICIALSTATE NEWS
4 లక్షల గృహాలు మంజూరు: మంత్రి పార్థసారథి

4 లక్షల గృహాలు మంజూరు: మంత్రి పార్థసారథి
అమరావతి ప్రతినిధి మార్చి 21 యువతరం న్యూస్:
ఇళ్ల నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పార్థసారథి మరో అప్డేట్ ఇచ్చారు. PMAY-2.0 కింద రాష్ట్రానికి నాలుగు లక్షల గృహాల మంజూరుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 53 వేల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని అన్నారు. లబ్ధిదారుల్లోని ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, పీవీటీజీలకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల మంజూరుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించారు.