ANDHRA PRADESHCRIME NEWSTELANGANA

చిట్టీల చీటర్ పుల్లయ్యను అరెస్ట్ చేయాలి

చిట్టీల చీటర్ పుల్లయ్యను అరెస్ట్ చేయాలి

సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయాలి

అనధికార, ప్రభుత్వ అనుమతి లేని చిట్టీల నిర్వాహకుడిపై కేసులు నమోదు చేయాలి

బహుజన సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా ఇన్చార్జ్ కొత్తూరు లక్ష్మీనారాయణ

హైదరాబాద్ బ్యూరో మార్చి 3 యువతరం న్యూస్:

ఎస్.ఆర్ నగర్ పరిధిలోని బికే గూడలో నివాసం ఉంటున్న చిట్టీల చీటర్ గుజ్జల పుల్లయ్యను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయాలని బహుజన సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా ఇన్చార్జి కొత్తూరు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులు, తాపీ మేస్త్రీలను నమ్మించి వేల మంది వద్ద అనధికార చిట్టీల రూపంలో వందల కోట్ల రూపాయలు వసూలు చేసుకుని మోసం చేసిన పుల్లయ్యపై చర్యలు తీసుకునే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని లక్ష్మీనారాయణ కోరారు. అనధికార, ప్రభుత్వ అనుమతి లేకుండా వందల కోట్ల రూపాయల చిట్టీలు నిర్వహించిన పుల్లయ్య నుంచి బాధితులందరికీ తిరిగి డబ్బులు చెల్లించేందుకు తెలంగాణ డిజిపి ప్రత్యేక చొరవ తీసుకోవాలని లక్ష్మీనారాయణ కోరారు. నగరాన్ని స్వచ్ఛంగా, సుందరంగా ఉంచే వేలాది మంది పారిశుధ్య కార్మికులు పుల్లయ్య వద్ద బాధితులుగా ఉన్నారని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులందరికీ న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని లక్ష్మీనారాయణ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్యంపల్లి గ్రామానికి చెందిన గుజ్జల పుల్లయ్య ఎస్.ఆర్ నగర్ మరియు హైదరాబాదులోని అనేక ప్రాంతాల్లో స్థిరపడిన పారిశుద్ధ్య కార్మికులందరికీ చిట్టిల ఏజెంటుగా పరిచయం పెంచుకొని నమ్మించి వందల కోట్ల రూపాయలు మోసం చేయడం బాధాకరమని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పుల్లయ్య దగ్గర మోసపోయిన అనేకమంది బాధితులు తనను సంప్రదించడంతో విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తెస్తున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!