AGRICULTUREANDHRA PRADESHOFFICIALSTATE NEWS
రైతులకు ఉచితంగా కంది విత్తనాలు పంపిణీ

రైతులకు ఉచితంగా కంది విత్తనాల పంపిణీ
కొత్తపల్లి యువతరం విలేఖరి;
మండలంలోని కొక్కెరంచ రైతు భరోసా కేంద్రంలో శనివారం యాగంటి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ధనలక్ష్మి రైతులకు ఉచితంగా టి ఆర్ జి 59 రకం కంది విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అపరాలు సామూహిక ప్రదర్శన క్షేత్రాల్లో భాగంగా 15 మంది రైతులకు ఒక్కో రైతుకు 8 కిలోలు చొప్పున కంది విత్తనాల ప్యాకెట్లు అందజేసినట్లు తెలిపారు. విత్తనాలు తీసుకున్న రైతులు పంట సాగు చేసి పంట నమోదు చేసుకోవాలన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించి పంటలు సాగు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ సుధాకర్, డాక్టర్ బాలరాజు, డాక్టర్ రవి గౌడు,మరియు గ్రామ హర్టికల్చర్ సహాయకులు అశోక్ కుమార్ మరియు రైతులు పాల్గొన్నారు.