ANDHRA PRADESHDEVOTIONALSTATE NEWS
త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండగ

త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండగ
వెల్దుర్తి యువతరం విలేఖరి;
త్యాగానికి ప్రత్యేకగా బక్రీద్ పండుగ అని ముస్లిం మత గురువులు పేర్కొన్నారు. మండల కేంద్రమైన వెల్దుర్తిలో గురువారం బక్రీద్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా మసీదులలో ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజులు నిర్వహించారు. ప్రార్థన అనంతరం చిన్నారులు, యువకులు, వృద్ధులు ఒకరినొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.