గోదావరి వరదల వల్ల ప్రజలకు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు
భద్రాద్రి జిల్లా కలెక్టర్ అనుదీప్

గోదావరి వరదలు వల్ల ప్రజలకు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లుతో సిద్ధంగా ఉండాలి
భద్రాద్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
భద్రాద్రి జిల్లా ,యువతరం ప్రతినిధి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో గోదావరి వరదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తు ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. వరద ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ముంపుకు గురయ్యే వరకు వేచి ఉండకుండా ముందస్తుగానే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా
సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. వరదల నుండి ప్రజలను కాపాడేందుకు గ్రామస్థాయి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సన్నాహక సమావేశంలో దిశానిర్దేశం చేసిన అంశాల పట్ల అన్ని శాఖల అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. వరదల్లో చిక్కుకున్న వ్యక్తులను రక్షించేందుకు లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లు, నాటుపడవలు, బోట్లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. రానున్న నాలుగు నెలల వరకు అనగా అక్టోబర్ మాసం వరకు సరిపోను అన్ని రకాల నిత్యావసర వస్తువులు స్టాకు ఉంచాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు. వరద ముంపు చర్యలు పర్యవేక్షణకు సెక్టోరియల్, జోనల్ అధికారులను నియమించనున్నట్లు చెప్పారు. వరద యొక్క సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ముంపు గ్రామాల ప్రజల ఫోన్ నెంబర్లును అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా పంచాయతీరాజ్, విద్యుత్తు శాఖ అధికారులు ముందస్తుగానే ముంపు గ్రామాల్లో పరిశీలన చేయాలని చెప్పారు. ముంపుకు గురయ్యే అవకాశాలున్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టి విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. అత్యవసర సేవలకు హెలికాప్టర్ సేవలు వినియోగించుకోవడానికి అనుగుణంగా హెలిప్యాడ్లు ఏర్పాటు చేయాలని రహదారులు భవనాల శాఖ అధికారులకు సూచించారు. అత్యవసర సేవలు కొరకు మొబైల్ సెట్లు వినియోగించేందుకు సెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. గోదావరికి పై నుండి వచ్చే వరద సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తుండాలని చెప్పారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు విషయంలో ప్రాధాన్యతలను తెలియచేయడంతో పాటు ఇబ్బందులు రాకుండా ముందస్తుగానే ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఆహారాన్ని తయారు చేసేందుకు వంట చేసే సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని చెప్పారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పనిచేయు చేయు విధంగా ఫ్లడ్ కంట్రోల్ రూము ఏర్పాటుతో పాటు మండల, జిల్లాస్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని చెప్పారు. వరదల సమయంలో గర్భిణి మహిళలు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాబితాను సిద్ధం చేసి సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్పించు విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులకు సూచించారు. వరదల సమయంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతుంటాయని ప్రజలు దాటే ప్రయత్నం చేయకుండా బారికేడింగ్ చేయాలని చెప్పారు. వాగులు దాటించడం వల్ల ప్రజలతో పాటు పశువులు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశాలున్నాయని, కాబట్టి ముందస్తుగానే సమాచారం ప్రజలకు చేరవేసి రక్షణ చర్యలు పాటించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వరదల సమయంలో అత్యవసర వైద్యసేవలకు అంతరాయం లేకుండా మందులను సిద్దంగా ఉంచాలని చెప్పారు. పాము, తేలు కాటు వంటి విష జంతువులకు సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. సింగరేణి, కేటిపిఎస్, ఐటిసి, నవభారత్ తదితర సంస్థల రెస్క్యూ టీముల సేవలు వినియోగించుకునేందుకు జాబితా అందుబాటులో ఉంచాలని చెప్పారు. వర్షాకాలంలో పశువులు వ్యాధులకు గురికాకుండా టీకాలు వేయు కార్యక్రమాలను చేపట్టాలని పశుసంర్దక అధికారులను ఆదేశించారు. గుత్తికోయ ఆవాసాల్లో పర్యటించి ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు.
లో లయింగ్ ఏరియాల్లో నీటి నిల్వలు లేకుండా డ్రెయిన్లు పరిశుభ్ర పరచడం, డ్రైయిన్లు నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పారు. విస్తా కాంప్లెక్సు, అశోక్ నగర్ నీటి నిల్వలు లేకుండా ఎత్తిపోసేందుకు మోటార్లును అందుబాటులో ఉంచాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వరదనీరు నిల్వ లేకుండా వెళ్లేందుకు డ్రెయిన్లును పరిశుభ్రం చేయాలని చెప్పారు. ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని బ్లీచింగ్, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించాలని చెప్పారు. మంచినీరు సఫరాకు ఇబ్బంది రాకుండా చూడాలని నీటి వనరులు ముంపుకు గురైతే మంచినీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా ప్రత్యాన్మయ చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, డి ఆర్ డి ఓ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, ఆర్ అండ్ బి ఈ ఈ భీమ్లా, తదితరులు పాల్గొన్నారు.