ANDHRA PRADESHBREAKING NEWSPROBLEMSWORLD

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను మరచిన వెల్దుర్తి మండల తహసిల్దార్ కార్యాలయం

ఈ నిర్లక్ష్యానికి కారకులెవరు

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను మరచిన వెల్దుర్తి మండల తహసిల్దార్ కార్యాలయం

స్వాతంత్ర సమరయోధులు, మాజీ ఉప ప్రధాని, సంఘసంస్కర్తను మరిచిన అధికారులు

ఈ నిర్లక్ష్యానికి కారకులెవరు

వెల్దుర్తి ఏప్రిల్ 5 యువతరం న్యూస్:

ఏప్రిల్ 5 అంటే దేశంలో ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది స్వాతంత్ర సమరయోధులు, మాజీ ఉప ప్రధాని, సంఘసంస్కర్త అయిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి గుర్తుకువస్తుంది. కానీ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి లోని తహసిల్దార్ కార్యాలయంలోని అధికారులకు మాత్రం ఆయన గుర్తుకు రాకపోవడం గమనించదగ్గ విషయం. ప్రతి కార్యాలయంలో ఆయన జయంతిని స్మరించుకొని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడలు నడవాలని కోరుకుంటాము. కానీ మండల కేంద్రమైన వెల్దుర్తి తహసిల్దార్ కార్యాలయంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి గుర్తుకు రాకపోవడం విచారకరం. ఆ స్థాయి వ్యక్తిని మర్చిపోవడం వెల్దుర్తి తహసిల్దార్ కార్యాలయం అధికారులకు మాత్రమే చెల్లింది. ఈ నిర్లక్ష్యానికి కారకులు ఎవరన్నది ప్రశ్న. భావిభారత పౌరులకు మార్గ నిర్దేశకులు అయిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ను మర్చిపోవడం క్షమించరాని నేరం. ఈ సంఘటనపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!