ANDHRA PRADESHHEALTH NEWSOFFICIALSTATE NEWS

కర్నూల్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి దయాగ్నొస్టిక్ విభాగం నందు అత్యాధునిక సి డి 4 ల్యాబ్ ప్రారంభం

కర్నూల్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి దయాగ్నొస్టిక్ విభాగం నందు అత్యాధునిక సి డి 4 ల్యాబ్ ప్రారంభం

కర్నూలు ప్రతినిది ఫిబ్రవరి 12 యువతరం న్యూస్:

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి డయాగ్నొస్టిక్ విభాగము నందు అత్యాధునిక సీడీ 4 ల్యాబ్ ను ఆసుపత్రి సూపరిండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు ప్రారంభించారు. వ్యాధి నిరోధక శక్తిని అంచనా వేయడంలో మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగుల చికిత్సలో సీడీ 4 పరీక్ష అత్యంత కీలకం. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ :- రోగులకు తక్కువ సమయంలోనే రిపోర్టులు అందజేయడం ద్వారా చికిత్సను వేగవంతం చేయవచ్చు అన్నారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా, సామాన్యులకు మెరుగైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతోనే ఈ సీడీ 4 ల్యాబ్‌ను ప్రారంభించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో డా. రేణుక దేవి ఎచ్ ఒ డి. మైక్రో బయాలజీ డా. సోమప్ప అసోసియట్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ మరియు ఏ ఆర్ టి. మెడికల్ ఆఫీసర్ డా. ఉదయిని మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!