ANDHRA PRADESHEDUCATIONOFFICIALSTATE NEWSTELANGANA

రాష్ట్రస్థాయి కరాటేలో సత్తా చాటిన నల్లమల్ల విద్యార్థులు

కరాటే మాస్టర్ ముఖేష్ కు గ్రామస్తుల ప్రశంసలు

రాష్ట్రస్థాయి కరాటేలో సత్తా చాటిన నల్లమల్ల విద్యార్థులు

కరాటే మాస్టర్ ముఖేష్ కు గ్రామస్తుల ప్రశంసలు

నాగర్ కర్నూల్ ప్రతినిధి జనవరి 5 యువతరం న్యూస్:

11 వ తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ -2026 పోటీల్లో నాగర్ కర్నూల్ జిల్లా లింగాలకు
చెందిన ముఖేష్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీలో ముఖేష్ మాస్టర్ చే శిక్షణ పొందుతున్న విద్యార్తలు అత్యుత్తమ ప్రతిభ మూడు కాంస్య పథకాలను
సాధించి సత్తా చాటడం పట్ల పలువురు గురువారం హర్షం వ్యక్తం చేశారు. 4 వ తేదీన తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం హైదరాబాదులో జరిగిన 11 వ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో లింగాలలో ముఖేష్ మాస్టర్ చే శిక్షణ పొందుతున్న విద్యార్థులు 35 కెజి ల స్పెయిరింగ్ విభాగంలో లింగాల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న అంకిత అదేవిధంగా అచ్చంపేట సమీపంలోని లింగోటం ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న సంజన ప్రావీణ్యం కనబడుతూ మూడవ స్థానాలు పొంది కాంస్య పతాకాలను కైవసం చేసుకున్నారు. 32 కెజి ల స్పెయిరింగ్ విభాగంలో లింగాల సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల కళాశాలలో ఐదవ తరగతి చదువుతున్న దిలీప్ తన నైపుణ్యంను ప్రదర్శిస్తూ మూడవ స్థానంతో కాంస్యం పతకాన్ని సాధించి సత్తా చాటినట్లు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు నరేష్, ముఖేష్ కరాటే అకాడమీ లింగాల బ్రాంచ్ కోచ్ ముఖేష్ మాస్టర్ తెలిపారు. కరాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నరేష్ తదితరులు విజేతలకు పథకాలను, గుర్తింపు దృవపత్రాలను అందజేసి ప్రశంసించారు. విద్యార్థులలో దాగిఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి ఆత్మ రక్షణ క్రీడగా ప్రసిద్ది చెందిన కరాటే లో శిక్షణ ఇస్తూ మెలుకువలు నేర్పిస్తున్న బ్లాక్ బెల్ట్ మాస్టర్ ముఖేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధించి ఈ ప్రాంతానికి గర్వకారంగా నిలిచిన విద్యార్థులను పలువురు అభినందించారు. విద్యతో పాటు కరాటే రంగంలోను రాణించాలని
ఆకాంక్షించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ వెంకటయ్య, ఎస్పై వెంకటేశ్వర్లు గౌడ్, ఎంఈఓ బషీర్ అహ్మద్, గురుకుల కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, వైస్ ప్రిన్సిపాల్ కుమార్,బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం మంగమ్మ తదితరులు ప్రశంషించారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!