ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముఖ్యమంత్రి వర్యుల పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయండి
సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్


ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముఖ్యమంత్రి వర్యుల పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయండి
సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్
ఎమ్మిగనూరు ప్రతినిధి ఫిబ్రవరి 4 యువతరం న్యూస్:
ఫిబ్రవరి 6వ తేదీన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటిస్తున్న నేపథ్యంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముఖ్యమంత్రి వర్యుల పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ఫిబ్రవరి 6 వ తేది నిర్వహించనున్న పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వర్యులు పాల్గొననున్న నేపథ్యంలో హెలిప్యాడ్, ప్రజావేదిక తదితర ఏర్పాట్లను సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ పరిశీలించారు.
ఈ సందర్భంగా సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ ప్రజా వేదిక ఏర్పాట్లను పరిశీలిస్తూ ఎంట్రన్స్ లో స్టాల్ల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజా వేదిక ప్రాంగణంలో ఎక్కువ మంది రైతులు వచ్చే అవకాశం ఉన్నందున బ్యారికేడింగ్, పార్కింగ్ ఏర్పాట్లు పై సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. హెలిప్యాడ్, పార్టీ కార్యకర్తల సమావేశపు ప్రదేశాలను పరిశీలించారు అనంతరం హెలిప్యాడ్, రోడ్డు మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మాట్లాడుతూ ఈ నెల 6 వ తేదీన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహించి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆదోని ఇంచార్జి ఆర్డీఓ అజయ్ కుమార్, పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్, డిపిఓ భాస్కర్, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వరరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.



