ANDHRA PRADESHDEVOTIONALWORLD
రేపల్లె గ్రామ దేవత శ్రీ బూరుగులమ్మతల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి అనగాని


రేపల్లె గ్రామ దేవత శ్రీ బూరుగులమ్మతల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి అనగాని
రేపల్లె జనవరి 31 యువతరం న్యూస్:
రేపల్లె పట్టణములో వేంచేసియున్న గ్రామ దేవత శ్రీ బూరుగులమ్మ అమ్మవారి 14వ తిరునాళ్ళ మహోత్సవం సందర్బంగా అమ్మవారికి రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు నందివెలుగు బాను సుధాకర్ మంత్రి అనగానిని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అనగాని శివప్రసాద్, ఆర్డీవో ఎన్ రామలక్ష్మి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తూనుగుంట్ల పాండురంగారావు, మాజీ కౌన్సిలర్ కొండవీటి వరప్రసాద్, దేవగిరి సాంబశివరావు, గుర్రం మురహరి, తాత ఏడుకొండలు, ధర్మ తేజ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.



