ANDHRA PRADESHEDUCATIONSOCIAL MEDIASTATE NEWS
పోలీస్ కానిస్టేబుల్ నుండి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఎంపిక

పోలీస్ కానిస్టేబుల్ నుండి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఎంపిక
తుగ్గలి జనవరి 31 యువతరం న్యూస్:
తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామానికి చెందిన హోటల్ భాష,మాబున్ని ల కుమారుడు చాంద్ బాషా మొదటిగా 2018 సంవత్సరం లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యి ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా రొల్ల పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తునే నిరంతర కృషితో చదివి తాజాగా విడుదలైనటువంటి గ్రూప్ 2 ఫలితాలలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గా విజయం సాధించడం జరిగింది. అతని తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ చదివించారు. అతని విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాల, కళాశాలలోనే సాగింది. అతను తల్లితండ్రుల కష్టాన్ని అర్థం చేసుకొని కస్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకోవటం అయ్యినది.అతని విజయం పట్ల కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.



